జలపాతం చూడటానికి వెళ్లి 10 మంది గల్లంతు (వీడియో)

మధ్యప్రదేశ్ లోని సుల్తాన్ గఢ్ జలపాతం చూడటానికి వెళ్లి 10 మంది గల్లంతయ్యారు. మరో 45 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మొహానా ప్రాంతంలోని సుల్తాన్ గఢ్ జలపాతాన్ని చూడటానికి దాదాపు వంద మందికి పైగా వచ్చారు. వీరంతా జలపాతం మధ్యలో బండరాళ్లపై నిలబడి స్నానం చేస్తుండగా ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా ఒక్కసారిగా వరద ప్రవాహాం పెరిగింది. దీంతో వారంతా నీటిలో చిక్కుకున్నారు.

నీటిలో చిక్కుకున్న వారిలో కొంత మంది వరద ప్రవాహాన్ని పసిగట్టి పక్కకు వెళ్లగా మరికొంత మంది బండరాళ్లను పట్టుకొని నిలబడ్డారు. నీటి ప్రవాహానికి 10 చూస్తుండగానే కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బండరాళ్లపై ఉన్న వారిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. పది మంది కళ్ల ముందే కొట్టుకుపోవడంతో అక్కడున్న వారంతా విషాదంలో మునిగిపోయారు. వరదలో చిక్కుకున్న వారు కొట్టుకుపోయిన వీడియో కింద ఉంది మీరూ చూడండి…