ఆంధ్ర ప్రదేశ్ లో ఫోక్సో యాక్టు కింద తొలి ఉరి శిక్ష

చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) సోమవారం ఫోక్సో ఆక్టు కింద ఆంధ్ర ప్రదేశ్ లో ప్రప్రధమంగా ఒకరికి హత్యాచారం నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధించింది.

చిత్తూరు జిల్లా కురబల గ్రామానికి ఒక పెళ్లి సందర్భంగా తలి దండ్రులతో వచ్చిన ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని మభ్యపరచి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన నేరం రుజువు కావడంతో మహమ్మద్ రఫీ అనే నేరస్తునికి జిల్లా సెషన్స్ జడ్జి ఉరి శిక్ష విధించారు.

ఈ కేసు సందర్భంగా మదనపల్లె పోలీసులు 17 రోజుల్లోనే చార్జి షీట్ దాఖలు చేశారు. కోర్టు 41 మంది సాక్షులను విచారించింది. నేరం రుజువు కావడంతో జడ్జి ఈ తీర్పు ఇచ్చారు. అయితే ఉరి శిక్ష అమలు డెత్ వారెంట్ హైకోర్టు నిర్ణయించుతుందని జడ్జి వెల్లడించారు.

ఇటీవల నెల్లూరులో కూడా 2013 లో జరిగిన జంట హత్యలు కేసు సందర్భంగా ఇంతియాజ్ కు కోర్టు ఉరిశిక్ష శిక్ష విధించడం పాఠకులకు విదితమే.