ఆంధప్రదేశ్ లో రూలింగ్ తెలుగు దేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ మధ్య ప్రచార యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వ్యక్తి గత ధూషణలు బాగా ముదిరాయి. ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటున్నారు.
జగన్ ఒకటంటే చంద్రబాబు మరొకటంటున్నారు.ఈ మధ్యలో పవన్ కూడా చురకలేస్తున్నారు. ఒకరికొకరు స్పందించే తీరు ఒక్కొక్క సారి చాలా తమాషాగ ఉంటున్నది.
మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అన్నారు. బాబు ఎందుకు 420 యో చాలా తెలివిగా, తమాషాగా చెప్పారు. చంద్రబాబునాయుడు చెప్పేవన్నీ మాయమాటలని, అబద్దాలని, చెప్పినవేవీ చేయడని అంతామోసమని అంటూ ఈ మోసానికి కారణం ఆయన జన్మదినంలో ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు జన్నదినం ఏప్రిల్ 20. అంటేనాలుగో నెల 20వ తేదీ. రెండు కలిపితే 420 అవుతుంది. ఐపిసి సెక్షన్ 420 కిందకువచ్చేవిచీటింగ్ కేసులు. చంద్రబాబు సెక్షన్ 420 అని అర్థం. అంతా ఔరా అనుకున్నారు.
దానికి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తానేం తక్కువ కాదన్నట్లు తగిన రీతిలో సమాధానంచెప్పారు.
నిజానికి చంద్రబాబు నాయుడు కొద్దిగా సీరియస్ వ్యవహారం. ఆయన దగ్గిర నుంచి జోకులు, చమక్కులు రావడం అరుదు. అయితే, పరిస్థితులు ఆయనలో దాక్కుని ఉన్న చమత్కారిని బయటకు లాగాయి.
వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా నేరాలుఘోరాలేనని అన్నారు.చిత్తూరు జిల్లా మదన పల్లిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎపుడేం కుట్ర లు చేస్తారో అర్థం కాని పరిస్థితి వచ్చిందని అన్నారు.జగన్ జైలు కు పోయివచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. జగన్ ప్రవృత్తిలో అంతా నేరాలు, ఘోరాలే కనబడతాయని అంటూ దీనికి కారణం చెప్పారు. జగన్ పేరులోనే గన్ (తుపాకి) ఉండటమే ఈనేర పవృత్తికి కారణమన్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
జగన్ కు వోటేస్తే జైలుకే అన్నారు. ‘జగన్ కు వోటేస్తే జైలుకు, పవన్ కు ఓటేస్తే అత్తారింటికి,’ అని చంద్రబాబు కూడా తనదైన శైలి చమత్కరించారు.
అంతేకాదు, ఒక్కాసారి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతున్న విషయానికి కూడా చంద్రబాబు చాలా చమత్కారంగా సమధానం చెప్పారు.
‘ఒక్కసారి తన ను గెలిపించాలని జగన్ ప్రజలను బతిమాలుతున్నారు. ఒక్కసారే కదా అని మనం తినే తిండిలో విషం కలుపుకొంటామా? ఒక్కసారే కదా అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా?, ఒకసారికదా అని ఆత్మ హత్య చేసుకుంటామని’అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
అందుకే ఎన్నికలనేవి భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారమని ఈ ఎన్నికల్లో జగన్ వంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.