పండగకి కొండెక్కిన బంగారం ధర

 

దసరా పుణ్యమా అని రెండు రోజులుగా తగ్గుతూ ఉన్న బంగారం ధర ఈరోజు పైకెక్కింది. నవరాత్రుల సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరగడంతో ధర పెరిగింది. బుధవారం 200 రూ.లు పెరగడంతో పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం 31,850 కి చేరింది. నవరాత్రి వేడుకల ప్రారంభం, అంతర్జీతీయ పరిస్థితులు, ఆభరణాల తయారీదారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరిగినట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు.

పసిడి ధర పెరిగినప్పటికీ వెండి ధర పెరగలేదు. 50 రూ.లు తగ్గడంతో కిలో వెండి 39,200 కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర తగ్గినట్టు ట్రేడర్లు వెల్లడించారు.