నిలకడగా బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర..!

gold prises rises and silver also

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. గురువారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి (Silver) ధరలు మాత్రం భారీగా తగ్గాయి. ఏకంగా రూ.5వేలకుపైగా దిగివచ్చింది.

నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.