భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్ 257.05 పాయింట్లు నష్టపోయి 35956.33 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51.70 పాయింట్లను కోల్పోయి 10828.40 వద్ద ముగిసింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.98గా ఉంది. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్ సూచీ 1.55 శాతం నష్టాలతో ముగిసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేరు విలువ 8శాతం తగ్గి రూ.120 వద్ద స్థిరపడింది. వరసగా పదో ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్లు షేర్లు లాభాలను పొందాయి. బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేరు విలువ 4.07 శాతం పెరిగి రూ.183 వద్ద ముగిసింది.