ఎడ్యుకేషన్ లోన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారా.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిబంధనలివే!

ప్రస్తుత కాలంలో స్కూల్ ఫీజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంటర్, బీటెక్ చదివించాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పిల్లల చదువు కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలను మాత్రం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

లోన్ తీసుకోవాలని భావించే వాళ్లు అవసరాలకు అనుగుణంగా లోన్ కోసం దరఖాస్తు చేయాలి. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని లోన్ తీసుకుంటే మంచిది. ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా వడ్డీ రేటు ఉండటం వల్ల అన్ని బ్యాంకులలో వడ్డీ రేట్లను తెలుసుకుని రుణం కోసం దరఖాస్తు చేస్తే మంచిది. విదేశీ విద్య చదివించాలని అనుకుంటే మరింత ఎక్కువ మొత్తం లోన్ అవసరమవుతుంది.

ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు తరచుగా ఎడ్యుకేషన్‌ లోన్‌లపై రాయితీలు లేదా ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. డెంటిటీ ప్రూఫ్‌, అడ్రెస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ డాక్యుమెంట్‌లు, అకడెమిక్‌ రికార్డ్స్‌, అడ్మిషన్ లెటర్ ను అందించడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సరైన డాకుమెంట్లతో బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే మంచిది. సంపాదన సామర్థ్యానికి అనుగుణంగా రీపేమెంట్ పీరియడ్‌ ను ఎంచుకుంటే మంచిది.

రెప్యుటేషన్‌, క్రెడిబిలిటీ ఉన్న ఆర్థిక సంస్థలను సంప్రదించడం ద్వారా కూడా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ ను తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లు పూర్తిస్థాయిలో నియమనిబంధనలను తెలుసుకొని లోన్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.