తండ్రి అప్పులను కొడుకులు చెల్లించాలా? కూతుళ్లు చెల్లించాలా.. న్యాయ నిపుణులు ఏం చెప్పారంటే?

Courts displaying a reckless attitude

ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సైతం సమానంగా వాటా ఉంటుంది. అయితే మరి అప్పులకు సంబంధించి కొడుకులకు బాధ్యత ఉంటుందా? కూతురుకు వాటా ఉంటుందా? లేక ఇద్దరికీ వాటా ఉంటుందా? అనే ప్రశ్నలకు ఇద్దరికీ వాటా ఉంటుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఒక వ్యక్తి చనిపోతే అతనికి ఎంతమంది వారసులు ఉంటే అంతమందికి అందులో వాటా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఏమైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించడం ద్వారా ఆస్తులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన డాక్యుమెంట్లతో లాయర్లను సంప్రదించడం సులువుగా ఆస్తిలో వాటా పొందవచ్చు. ఆస్తుల విషయంలో అన్యాయం జరిగితే మాత్రం ఈ విధంగా చేస్తే మంచిది.

కూతుళ్లు ఆస్తులతో పాటు అప్పులతో సైతం వాటా పంచుకోవాలి. అదే సమయంలో అవసరమైతే తల్లీదండ్రుల పోషణ భారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తల్లీదండ్రుల ఇష్టానుసారం ఆస్తులను పంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తల్లీదండ్రులు చేసిన ఆస్తులపై ఏ విధంగా హక్కులు ఉంటాయో అప్పులపై సైతం అదే విధంగా హక్కులు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఆస్తులను పంచుకున్న విధంగానే అప్పులను పంచుకుంటే మంచిది. చిన్నచిన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. లాయర్ల ఫీజులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. కూతురు కట్నం తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని మినహాయించి ఆస్తులలో వాటాను పంచుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.