బాబు సొమ్ము లాయర్ల పాలు… లాజిక్ మిస్సవుతున్న తముళ్లు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9న అరెస్టైన చంద్రబాబు ఆ తర్వాత రోజు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం, మందులు అందుస్తున్నాయి. ఇటీవల టవర్ ఏసీ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే సమయంలో చంద్రబాబు కాస్త బరువు కూడా పెరిగారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు తరుపు లాయర్లు కోర్టుల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

చంద్రబాబు జైలుకి వెళ్లి ఇవాళ 39వ రోజు. రిమాండ్ పై వాదనలు జరిగిన రోజుతో కలిపి లెక్కపెడితే.. 40 వ రోజు! ఈ 40 రోజుల్లో చంద్రబాబు తరుపున సుమారు 18 పిటిషన్లు ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యాయని చెబుతున్నారు. ఇదే సమయంలో దాదాపు ప్రతీ రోజూ ఏదో ఒక కోర్టులో చంద్రబాబు కేసులకు సంబంధించి పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయన్నమాటే! దీంతో ఇప్పటివరకూ లాయర్లకు చంద్రబాబు ఎంత సొమ్ము చెల్లించారనేది హాట్ టాపిక్ గా మారింది.

రోజుకి సుమారు కోటి రూపాయలు తీసుకునే సీనియర్ మోస్ట్ న్యాయవాదులు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారనే చర్చ ఏపీలో విపరీతంగా నడుస్తుంది. వారితో పాటు చిన్నా చితకా మొత్తం కలిపి 40 మంది లాయర్ల వరకూ చంద్రబాబు కోసం లా పుస్తకాలు తిరగేస్తున్నారని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో ఎంత తక్కువగా లెక్కేసుకున్నా… ఇప్పటివరకూ చంద్రబాబు.. లాయర్లకు ఎంత మేర వెచ్చించి ఉండొచ్చు.. తెలిస్తే అది రికార్డే అని అంటున్నారు!

తాజాగా ఇదే విషయాలపై ఏపీ మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించరు. ఇందులో భాగంగా.. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా… చంద్రబాబు సొమ్ము సుప్రీంకోర్టు లాయర్ల పాలవుతుందని ఎద్దేవా చేశారు! అనంతరం… చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కొంతమంది చేస్తున్న విమర్శలపై పేర్ని నాని స్పందించారు.

ఇందులో భాగంగా… కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలులో పెట్టారంటూ టీడీపీ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా జైలు గోడల మధ్యన ఉంటే దానికి, ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని, ఈ కేసులో అంతకుముందే ఈడీ,ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ డిపార్ట్ మెంట్లు విచారణ చేపట్టి అవినీతి జరిగిందని తేల్చిన తర్వాతే సీఐడీ తన విచారణను చేపట్టిందని గుర్తుచేశారు.

ఆ క్రమంలో ఏపీ సీఐడీ డిపార్ట్ మెంట్ మజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే.. ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ విధించిందని తెలిపారు. ఫలితంగా సుమారు 39 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కేసులు ఏసీబీ కోర్టుల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నాయని.. ఆ మూడు చోట్లా విచారణ సాగుతోందని వివరించారు.

టీడీపీ నేతలు బ్లైండ్ ఆ చేస్తోన్న ఆరోపణలను కాసే పక్కనపెట్టి… అసలు ఏ ఆధారాలూ లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతున్నారు.. అని ఆలోచిస్తే అన్నీ అర్ధమవుతాయని చెబుతున్నారు. దీంతో… ఇంత చిన్న లాజిక్‌ ని మిస్సయితే ఎలా తమ్ముళ్లూ అంటూ ఆయన టీడీపీ శ్రేణులను, బాబు అరెస్ట్ పై అవాకులూ చెవాకులూ పేళుతున్నవారినీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.