వైఎస్ జగన్ వ్యవహారంలో వెనకడుగు వేస్తున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు.. రానున్నది కష్టకాలమేనా.. ??

bjp wants to spread hinduism in ap with help of ys jagan

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇప్పటికే ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి.. పాలనాపరమైన ఇబ్బందులతో పాటుగా, వర్గపోరు, ప్రతిపక్ష పోరు, మూడు రాజధానుల రగడ.. ఆర్ధికపరమైన ఇబ్బందులు, కోవిడ్ కష్టాలు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లితే ఎన్నో సమస్యలు.. ఇవన్నీ చాలవు అన్నట్లుగా ఆయన తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా మారి మరిన్ని చిక్కుముడులు పడుతున్నాయి.. ఇలా మొత్తానికి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్..

ఇక కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైనే వైఎస్ జగన్ సీయం హోదాలో ఆరోపణలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలనే పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలైన విషయం విదితమే.. ఈ నేపధ్యంలో రానున్న కాలంలో ఈ వ్యవహారం ముదిరితే ఈ సీయం ఇబ్బందులకు గురవడం తప్పదనే సంకేతాలు ఇప్పుడు పెద్దఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయట.. అదీగాకా ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తుందట.

ఇప్పటికే రిటైర్డ్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల అసోసియేషన్ వైఎస్ జగన్ తీరుపై మండిపడుతూ న్యాయవ్యవస్థ ను చులకన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.. ఇదే కాకుండా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అంశం ఆషామాషీ వ్యవహారం కాదని, ఇప్పటికే జగన్ పై 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఆ తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.. అయితే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం కూడా తప్పనిసరి కావడంతో, ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఇది పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు..

ఒకవేళ ఈ వ్యవహారంలో తలదూర్చి సంధిచేయాలని ప్రయత్నిస్తే తమకు చిక్కులు తప్పవని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారట. ఇలా ఈ విషయం లో ఏ విధంగా ముందుకు వెళ్ళినా కమళం జనంలో చులకన కావడం, ప్రతిపక్షాలు నిందించడానికి అవకాశం ఇవ్వడం వంటివి జరగవచ్చనే భావనలో వెనకడుగు వేస్తున్నారట.. ఒకవేళ ఈ రగడ మరింత రచ్చగా మారితే వైఎస్ జగన్‌కు కష్టాలు ముదిరి ఊసరవెళ్లిలా మారే అవకాశాలున్నాయని అనుకుంటున్నారట వైసీపీ వర్గీయులు.. మరి ఈ వివాదం ఎలా సమసిపోతుందో వేచిచూడాలి..