డబ్బులు దాచుకునే వాళ్లకు బెస్ట్ స్కీమ్స్ ఇవే.. ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పై వడ్డీ రేట్లను పెంచగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. కేంద్రం అమలు చెస్తున్న స్కీమ్స్ లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి.

 

ఈ స్కీమ్ లో ప్రస్తుతం వడ్డీ రేటు 6.9 శాతంగా ఉందని తెలుస్తోంది. కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ 2 ఇయర్స్ టెన్యూర్‌పై కూడా వడ్డీ రేటు ఎక్కువ మొత్తంగా ఉంది. ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లపై సైతం గతంలో అమలవుతున్న వడ్డీ రేట్లతో పోల్చి చూస్తే వడ్డీ పెరిగింది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 6.5 శాతం వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆర్‌డీ స్కీమ్ టెన్యూర్ పది సంవత్సరాలుగా ఉండనుంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి సంబంధించి వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుందని చెప్పవచ్చు.

 

భవిష్యత్తులో పొందే ప్రయోజనాలకు అనుగుణంగా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే ఛాన్స్ ఉండటంతో ఈ స్కీమ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు.