రైతులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. ఆ డబ్బులను కేంద్రం రెట్టింపు చేస్తుందా?

 

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు బెనిఫిట్ కలిగేలా కొత్త స్కీమ్స్ ను అమలులోకి తీసుకొనిరావడంతో పాటు ఆ స్కీమ్స్ తో రైతులకు వేల రూపాయల బెనిఫిట్ కలిగేలా చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో 6000 రూపాయలు జమవుతోంది. అయితే కేంద్రం ఈ మొత్తాన్ని పెంచనుందని తెలుస్తోంది.

 

ప్రస్తుతం 6000 రూపాయలు ఇస్తున్న మొత్తాన్ని 12000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కేంద్రం ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే రైతులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి సంవత్సరం పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతుండగా రైతులకు మేలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. కోట్ల సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ స్కీమ్ మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నారు.

 

మరోవైపు ఎరువులపై సబ్సిడీని పెంచాలని కొంతమంది రైతుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ స్కీమ్ నగదు 13 విడతల్లో జమ కాగా రైతులకు 26000 రూపాయల బెనిఫిట్ కలిగింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం 14వ విడత నగదును సైతం రైతులకు జమ చేయనుందని సమాచారం అందుతోంది. గతంలోనే పీఎం కిసాన్ నగదు మొత్తాన్ని పెంచుతున్నట్టు వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.

 

8 కోట్ల కంటే ఎక్కువమంది రైతులకు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం. కొంతమంది రైతులు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అర్హత లేని వాళ్లను ఈ స్కీమ్ నుంచి కేంద్రం తొలగిస్తుండటం గమనార్హం.