వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

పెట్రోల్ డీజిల్ రేట్లు అనూహ్యంగా పెరుగుతుండడంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. శనివారం నాడు కూడా పెట్రోల్ ధర 19 పైసలు, డీజిల్ ధర 29 పైసలు పెరిగింది.

ఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర 69 రూపాయలు కాగా డీజిల్ ధర లీటర్ 63.10 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 75 రూపాయలు కాగా డీజిల్ ధర 66కు చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 73.41 కాగా డీజిల్ ధర రూ. 68.57 కి పెరిగింది.

కొల్ కత్తాలో పెట్రోల్ ధర 71.39 కాగా డీజిల్ ధర 64.62, చెన్నైలో పెట్రోల్ ధర 71.87 కాగా డీజిల్ ధర 66.35, బెంగుళూరులో పెట్రోల్ ధర 71.53 కాగా డీజిల్ ధర 65 రూపాయలుగా ఉంది.