పాత కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్‌ ఉంటే సులువుగా రూ.5 లక్షలు పొందవచ్చట.. ఎలా అంటే?

మనలో చాలామంది పాత కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్‌ ను కలిగి ఉంటారు. మన దేశంలో పురాతన వస్తువులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. పురాతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతోమందిలో ఆసక్తి ఉంది. అందువల్ల సాధారణంగా పురాతన వస్తువులు అసలు విలువ కంటే ఎక్కువ విలువ పలుకుతున్నాయి. పురాతన వస్తువులను సేకరించడం అలవాటుగా మార్చుకుంటే మంచిది.

ఓల్డ్ కాయిన్స్ కు ఊహించని స్థాయిలో విలువ ఉంటుంది. కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా పాత కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్‌ ను సులువుగా విక్రయించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది దగ్గర ఉన్న పురాతన నాణేల విలువ 100 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. నాణెం, నోటు ఎంత పాతదైతే దాని విలువ అంత పెరుగుతుంది.

అయితే అమ్మిన వెంటనే ఆ కాయిన్లు ఎక్కువ మొత్తం విలువ పలుకుతాయా అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుంది. కొన్ని ప్రత్యేక నంబర్లు ఉన్న నోట్లు సాధారణ విలువ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. కొంతమంది పాత నాణేలను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అమ్మడం లేదా కొనుగోలు చేయడం చేస్తుండటం గమనార్హం. కొంతమంది వ్యాపారులు ఈ బిజినెస్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

అయితే మరీ అరుదైన నాణేలను మాత్రం ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా దొరికే నాణేలను కొనుగోలు చేయడానికి మాత్రం ఎక్కువమంది ఆసక్తి చూపించరు. కొన్ని ప్రాంతాలలో చిన్నచిన్న వ్యాపారులు పాత నాణేలను కుప్పలు కుప్పలుగా పోసి విక్రయిస్తూ ఉంటారు. వాటిని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి.