వాట్సప్ లో మరొక అప్డేట్… ఇకపై ఆ సమస్యలు తీరినట్టేనా?

ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలో వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా వాట్స్అప్ మరొక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు షేర్ చేయటం చాలా సులభం. కానీ.. ఫోటోలు వీడియోలతో పాటు ఉన్న టెక్స్ట్‌ ఫార్వర్డ్‌ చేసే విషయంలో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్ట్స్ మెసేజ్‌ తో ఉన్న ఫోటోలు లేదా వీడియోలను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌ లేదా వీడియో మాత్రమే వెళ్తుంది. దీంతో మళ్లీ ఆ మెసేజ్‌ టెక్స్ట్‌ ఫార్వర్డ్ చేయటానికి వీలు లేకుండా మళ్లీ టైప్‌ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వాట్సప్ సంస్థ చెక్ పెట్టనుంది‌.

ఫోటోలు వీడియోలతో పాటు టెక్స్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి వీలుగా సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. టెక్స్ట్‌ మెసేజ్‌తోపాటుగా ఇమేజ్‌, వీడియోను ఫార్వర్డ్‌ చేయాలంటే ఆండ్రాయిడ్‌లో కొన్ని టిప్స్ పాటించి చేయొచ్చు కానీ.. ఐవోఎస్‌లో చేయటం కష్టం. ఆండ్రాయిడ్‌ ఫోన్ లో ఉండే షేర్‌ ఆప్షన్‌ ద్వారా రెండూ ఫార్వర్డ్‌ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఇమేజెస్ తో పాటు టెక్స్ట్ కూడా సులభంగా ఫార్వర్డ్ చేయడానికి వీలుగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ పనిచేస్తోంది. బీటా యూజర్లు కొంతమందికి ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల తనఖీలు పూర్తి చేసుకుని.. అంతా ఓకే అనుకుంటే ఈ ఫీచర్‌ను రెగ్యులర్‌ యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు.