కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ టాలెంట్ ఉన్న విద్యార్థులకు మేలు జరిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉచితంగా డబ్బులు పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ ఒక కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. నేషనల్ ఆన్‌లైన్ ఎస్సే కాంపిటీషన్ ను కేంద్రం నిర్వహిస్తుండగా ఈ పోటీలో పాల్గొని విజేతగా నిలిచిన వాళ్లకు 30,000 రూపాయలు లభిస్తాయి.
మై గౌ వెబ్‌సైట్ ద్వార సులభంగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా డిట్ దివాస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలో పాల్గొంటే టాలెంట్ ఉన్నవాళ్లు సులభంగా పోటీ పక్షలో విజేతగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది. భారత ప్రజాస్వామ్యంలో కాగ్ పాత్ర గురించి ఎస్సే రాయాల్సి ఉంటుందని సమాచారం.
ఈ కాంటెస్ట్ ను నిర్వహించడం ద్వారా దేశంలోని యువతీయువకులకు అవగాహన కల్పించనున్నారని సమాచారం అందుతోంది. సుపరిపాలన, జవాబుదారీతనంకు సంబంధించి కాగ్ బాధ్యతను మరింత పెంచేందుకు ఈ కాంటెస్ట్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. తొలి విజేతకు ఫ్రైజ్ మనీ 30 వేలు కాగా రెండో విజేతకు 20 వేలు, మూడో విజేతకు 15 వేలు లభిస్తాయి.
essay2023@cag.gov.in మెయిల్ కు 1500 కంటే తక్కువ పదాలతో వ్యాసాన్ని పంపాల్సి ఉంటుంది. ఆగష్టు నెల 20వ తేదీ వరకు ఈ ఎస్సే పోటీ ఉంటుందని భోగట్టా. ఏదైనా యూనివర్సిటీలో చదువుతూ 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పోటీ పరీక్షకు అర్హులు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ పోటీ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.