నేటి ఆధునిక సమాజంలో మగవారికి ఏమి తీసుకోకుండా మహిళలు అన్నింటిలో పోటీపడుతున్నారు. అన్ని విషయాలతో పాటు మందు, సిగరెట్ల విషయంలో కూడా మగవారితో పాటుగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఈ దురలవాట్లకు ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. ఈ మేరకు
8 మంది టీనేజ్ అమ్మాయిలు కలిసి మద్యం బాటిల్ కోసం 59 సంవత్సరాల వృద్ధుడిని హతమార్చిన సంఘటన కెనడాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మద్యం బాటిల్ కోసం వృద్ధుడిని పదునైన ఆయుధంతో దాడి చేసే హత్య చేశారని పోలీస్ అధికారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…డిసెంబర్ 18న కెనడాలోని టొరెంట్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎనిమిది మంది యువతులు ఆన్లైన్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఈ దారుణ హత్యలో పాల్గొన్న ఎనిమిది మందిలో ముగ్గురు 13, ముగ్గురు 14, మరొక ఇద్దరు 16 ఏళ్ల వయసులో యువతులుగా పోలీసులు తెలిపారు. మద్యం కోసం 59 ఏళ్ల వృద్ధుడి మీద పదునైన ఆయుధంతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని పోలీసులు స్వయంగా ఆసుపత్రిలో చేర్పించే చికిత్స అందించినప్పటికీ వృద్దుడు ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో హత్యకు పాల్పడిన ఎనిమిది మంది టీనేజ్ అమ్మాయిల పై హత్య నేరం కేసు నమోదు చేశారు. వీరిని డిసెంబర్ 29న కోర్టు కు హాజరు పరుస్తారు. టొరంటో పోలీసు సర్వీస్ హోమి సైడ్ విభాగానికి చెందిన డిటెక్టివ్ సార్జెంట్ టెర్రీ బ్రౌన్ విలేకరులతో మాట్లాడుతూ…. ఎనిమిది మంది అమ్మాయిలు నగరంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారని…. 8 మంది గుంపుగా వెళ్లి దాడి చేస్తున్నారని తెలిపారు. అయితే మీరు ఈ బుద్ధుడి మీద దాడికి ముందు నే వేరే ఎవరి మీదైనా దాడి చేసే ప్రయత్నం చేసి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎనిమిది యువతులు పోలీస్ కస్టడీలో జైల్లో ఉన్నారు.