ఎల్ఐసీ సూపర్ పాలసీ ఇదే.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.12000 పొందే అవకాశం?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల వల్ల పాలసీలు తీసుకున్న వాళ్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. ఎల్ఐసీ పాలసీలలో పెన్షన్ స్కీమ్స్ కూడా ఒక భాగం కాగా యాన్యుటీ ప్లాన్స్ తీసుకోవడం వల్ల ప్రతి నెలా పెన్షన్ తో పాటు ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ పాలసీ తీసుకోవడానికి 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సు అర్హతగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు తర్వాత నెల నుంచి సులభంగా పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్ ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకున్న తర్వాత పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పాలసీని తీసుకుంటే ప్రతి నెలా 12,400 రూపాయలు పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎంత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ మొత్తం పెన్షన్ లభిస్తుంది. వయస్సు పైబడిన వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సరళ్ పెన్షన్ పాలసీ చిన్న వయస్సులోనే పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు బెనిఫిట్ కలిగిస్తుంది.

పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత అవసరమైతే పాలసీని సరెండర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భార్యాభర్తలు ఈ పాలసీని తీసుకోవడం ద్వారా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తక్కవ వయస్సు నుంచే పెన్షన్ ద్వారా రాబడి పొందాలని భావించే వాళ్లు ఈ పాలసీ తీసుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది.