దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే పాలసీలను మించినది లేదు. పొదుపు + బీమాతో పాటు గ్యారంటీ రిటర్న్స్ తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ ఉత్సవ్ పేరుతో ఒక పాలసీని అమలు చేస్తోంది. ఈరోజే ఈ పాలసీని లాంఛ్ చేసింది.
ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ లాంగ్ బీమా అందించే పాలసీ కాగా ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత లైఫ్ లాంగ్ ఆదాయం పొందవచ్చు. హామీ మొత్తంలో 10 శాతం ఆదాయంగా చెల్లించడం జరుగుతుంది. రెగ్యులర్ ఆదాయం వద్దని భావించే వాళ్లు ఫ్లెక్సీ ఆదాయాన్ని ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ విధానాన్ని ఎంచుకున్న వాళ్లు చక్రవడ్డీ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రీమియం చెల్లించే కాలానికి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారంటీ అడిషన్స్ లభిస్తాయి. 65 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్ల వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేర్వేరు రైడర్లను ఎంచుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంటుంది. కనిష్ట బీమా మొత్తం 5 లక్షల రూపాయలుగా ఉంది.
25 సంవత్సరాల వ్యక్తి 12 ఏళ్ల ప్రీమియం టర్మ్ కు 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే 86,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 38వ ఏట నుంచి సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ఆదాయం వస్తుంది. రెండో ఆప్షన్ ను ఎంచుకుంటే చక్రవడ్డీ రూపంలో 43.11 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.