మీ ద‌గ్గ‌ర జియో హ్యాండ్‌సెట్ ఉందా?

రిలయన్స్ జియో యాజ‌మాన్యం కొత్త‌గా జియో రైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియోఫోన్, జియోఫోన్-2 వినియోగదారుల కోసం ఈ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా ఈ-వాలెట్ల నుంచి రైలు టికెట్లను బుక్ చేసుకోవ‌చ్చు. త‌త్కాల్ విధానం కింద కూడా టికెట్ల‌ను తీసుకునే వెస‌లుబాటు ఉంది. టిక‌ట్ క్యాన్సెలేష‌న్, పీఎన్‌ఆర్ స్టేటస్‌ను తెలుసుకునే వీలు ఉంది. రైళ్ల రాక‌పోకల వివ‌రాలు, స్టేష‌న్ల వారీగా వాటి షెడ్యూల్‌, సీట్ల లభ్యత వంటి వివరాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని రిలయన్స్ జియో యాజ‌మాన్యం వెల్లడించింది.