షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ’డంకీ’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ సినిమాకు ఓటీటీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో సినిమాస్ రూ.155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో రికార్డు ధరకు డంకీ ఓటీటీ రైట్స్ పోవడంతో షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామంలో నలుగురు స్నేహితులు ఇంగ్లండ్ వెళ్ళాలి అనుకుంటారు.
అయితే వారు వెళ్లడానికి డబ్బు కానీ, వీసాలకి తగినంత చదువు కానీ ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి వచ్చిన హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఇంగ్లండ్ తీసుకెళుతానని చెబుతాడు. దీనికోసం హార్డీ ప్రణాళికలు చేస్తాడు. అయితే ఈ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి.
ఈ క్రమంలోనే వారు ఇంగ్లండ్ వెళ్లడానికి అక్రమ మార్గం ఎంచుకుంటారు. దొంగతనంగా డంకీ ట్రావెల్ ద్వారా లండన్?కు వెళ్లాలి అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు వాళ్ళు లండన్ కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? అనేది అసలు కథ.