కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ సహాయంతో ఎలాంటి బ్యాలెన్స్ అవసరం లేకుండా అకౌంట్ ను ఓపెన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డబ్బులు డిపాజిట్ చేయకుండానే సులభంగా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా అకౌంట్ తీసుకున్న వాళ్లకు 2 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లభించడంతో పాటు 30 వేల రూపాయల వరకు బీమా లభిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వాళ్లకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ 30,000 రూపాయలు ఉండగా అకౌంట్ లో డబ్బులు లేకపోయినా 10 వేల రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉండటంతో ఈ అకౌంట్ ఉన్నవాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
పేదరికాన్ని తగ్గించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందించాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేయడం జరుగుతోంది. సమీపంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశంతో పాటు సులువుగా అకౌంట్న్ ఓపెన్ చేయవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను అందించడం ద్వారా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
బ్యాంక్ అకౌంట్ ను కనీసం 6 నెలలు ఉపయోగిస్తే మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. జన్ ధన్ స్కీమ్ ను కలిగి ఉండటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.