ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సులువుగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేలా ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా సులువుగా జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇప్పటివరకు దేశంలో 50,000 కంటే ఎక్కువగా జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఈ అకౌంట్లలో మహిళల అకౌంట్స్ ఎక్కువ కావడం గమనార్హం. ఈ పథకం ప్రారంభమైన వారం రోజుల్లోనే దాదాపుగా 2 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.
ఈ అకౌంట్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కాగా ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు వడ్డీ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన ఇతర స్కీమ్స్ ప్రయోజనాలను సైతం పొందవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
జన్ ధన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ను పూర్తి చేసి కేవైసీ పూర్తి చేయడం ద్వారా సులభంగా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ అకౌంట్ ద్వారా ఏటీఎం కార్డ్ ను పొందిన వాళ్లకు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయని చెప్పవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ద్వారా జన్ ధన్ అకౌంట్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. జన్ ధన్ యోజన ఖాతా ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇతర బ్యాంకులలో అకౌంట్లు కలిగి ఉన్నవాళ్లు సైతం ఈ జన్ ధన్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.