కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ జన్ ధన్ అకౌంట్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో దాదాపుగా 50 కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్లు ఉన్నాయి. ఎవరైతే జన్ ధన్ అకౌంట్లను కలిగి ఉన్నారో వాళ్లు ఎలాంటి బ్యాలెన్స్ ను నిల్వ ఉంచకుండా సులభంగా లావాదేవీలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా జన్ ధన్ ఖాతాలను అందించాయి.
ఎవరైతే జన్ ధన్ అకౌంట్ ను కలిగి ఉంటారో వాళ్లు కొన్ని బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో పాటు చెక్ బుక్, ప్రమాద బీమా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కేంద్రం భారీగా పెంచడంతో ఈ ఖాతా ఉన్నవాళ్లకు అదిరిపోయే బెనిఫిట్స్ లభించనున్నాయి.
గతంలో ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ 5,000 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ మొత్తం రెట్టింపు అయింది. 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ లో భాగంగా తీసుకునే అవకాశం ఉండటం జన్ ధన్ ఖాతాదారులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ కు అర్హులు కాగా కనీసం 6 నెలల పాటు యాక్టివ్ గా ఉన్న అకౌంట్లు ఈ బెనిఫిట్ పొందవచ్చు.
ఎవరైతే జన్ ధన్ ఖాతాలను కలిగి ఉంటారో వాళ్లకు రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది. రూపే డెబిట్ కార్డ్ వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు జన్ ధన్ ఖాతాను తెరవవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.