సాధారణంగా మనం సంపాదించిన డబ్బును మన ఖర్చులకు ఉపయోగించుకొని మిగిలినది మన అకౌంట్లో సేవింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా సేవింగ్ చేసుకున్న అమౌంట్ మనకు అవసరమైనప్పుడు డ్రా చేస్తూ ఉంటాం.అయితే కొన్నిసార్లు అవసరానికి మన అకౌంట్లో డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము అయితే ఇలా ఇబ్బంది పడకుండా మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా మనం పదివేల రూపాయల వరకు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా అకౌంట్లో డబ్బులు లేకపోయినా డ్రా చేసుకునే అవకాశాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని పిలుస్తారు.
అయితే ఇలా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా అకౌంట్ ఉన్న వారందరూ కూడా పదివేల రూపాయలు డ్రా చేసుకోవడానికి వీలు లేదు.ఎవరైతే ఎక్కువగా వారి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇలా అత్యవసర పరిస్థితులలో అకౌంట్లో డబ్బులు లేకపోయినా పదివేల రూపాయలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా జన్ ధన్ అకౌంట్ ని తీసుకు వచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ని ఇచ్చింది. జన్ ధన్ అకౌంట్ ఉన్న వారు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు డ్రా చేయొచ్చు.
2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం అందించే ఇతర పథకాలకు చెందిన డబ్బుల్ని ఈ అకౌంట్ తో పొందచ్చు. సాధారణంగా సేవింగ్ అకౌంట్ తెరవాలి అంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం జీరో బ్యాలెన్స్ తో ఈ అకౌంట్ తెరవచ్చు. జన్ ధన్ అకౌంట్ ని తెరిస్తే ఫ్రీగా రూపే డెబిట్ కార్డ్ వస్తుంది. ఇదే కార్డుపై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా వస్తుంది. రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది ఇలా మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు.