మాములుగా చాలామంది ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ పెద్ద మొత్తం డబ్బును రియల్ ఏస్టేట్‌లో పెట్టుబడిగా పెడదామంటే రిస్క్ అనిపిస్తుంది. పోనీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామా అంటే అదీ రిస్క్‌తో కూడుకున్న అంశమే సఅని చెప్పాలి. దాంతో ఏం చేయాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ డబ్బు భద్రంగా ఉంటుంది ప్రతి రోజు వడ్డీ తెచ్చుకునే అవకాశం వస్తే ఎవరు కూడా కాదనరు.
అయితే అలాంటి వారి కోసమే భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. డబ్బుకు ఎలాంటి రిస్క్ లేకుండా ఎంచక్కా నెలనెలా వడ్డీ విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న ఆ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఏంటి? ఎంత వడ్డీ వస్తుంది అన్న వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పోస్టాఫీస్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ప్రతీ నెల వడ్డీని పొందవచ్చు. ఈ అకౌంట్ ను సింగిల్ లేదా జాయింట్ అకౌంట్‌గా కూడా తీసుకోవచ్చు.
అయితే సింగిల్ అకౌంట్ లో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.అదే ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ పథకంలో 5 సంవత్సరాల కాలానికి డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి పోస్టాఫీస్ 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఇందులో వచ్చే వడ్డీని ప్రతీ నెల విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఐడియా బాగుంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో చేరి మీ డబ్బులు భద్రపరచుకోవడం తో పాటు వడ్డీలు కూడా పొందండి..