ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్ ను మార్చాలా.. ఇలా చేస్తే సులువుగా మార్చవచ్చట!

మనలో చాలామందికి ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటి. ఈ కార్డ్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అస్సలు పొందలేమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ కు సంబంధించిన వివరాలను కొంతమంది సులువుగానే మార్చుకుంటే మరి కొందరు మాత్రం ఆ వివరాలను మార్చుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆధార్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సరిగ్గా అప్ డేట్ చేసుకుంటే మంచిది.

 

ఆధార్ కార్డ్ కు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో సులభంగా మార్చుకోవడం సాధ్యం కాదు. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడం ద్వారా మాత్రమే ఈ వివరాలను మార్చుకోవడం సాధ్యమవుతుంది. సమీపంలో ఉన్న ఎన్ రోల్ మెంట్ సెంటర్ వివరాలను తెలుసుకోవడం ద్వారా ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ వివరాలను మార్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డ్ కు సంబంధించిన జిరాక్స్ ను సమర్పించడంతో పాటు ఫీజు చెల్లించడం ద్వారా ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్ ను మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన 90 రోజుల్లోగా మొబైల్ నంబర్ అప్ డేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలి.

 

ఎవరైతే ఈ విధంగా ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకోరో వాళ్ల కార్డ్ ఎక్స్ పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ ఎక్స్ పైర్ అయితే పథకాల ప్రయోజనాలను పొందే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని సమాచారం అందుతోంది. 1947 నంబర్ ను సంప్రదించడం ద్వారా ఆధార్ కు సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.