ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్… ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఆన్లైన్ సేవలు..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ( ఎల్ఐసి ) తమ కస్టమర్లకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఎల్ఐసి అందిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్థికంగా ధైర్యంగా ఉంటున్నారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్ఐసి కూడా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమలులోకి తీసుకువస్తుంది. ఇక ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం ఎల్ఐసి మరొక సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకున్న పాలసీదారులకు వాట్సప్ ద్వారా కూడా సేవలు అందించనుంది.

పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్‌ చాట్‌బాక్స్ ద్వారా ఈ వాట్సప్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎల్ఐసి పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు అధికారిక వాట్సాప్‌ చాట్‌బాక్స్ ద్వారా ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్, స్టేట్‌మెంట్లతో పాటుగా ఇంకొన్ని లాభాలని అవకాశం కల్పిస్తోంది. అయితే వాట్సప్ ద్వారా సేవలను పొందటానికి ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎల్ఐసి ఈ విషయాన్ని ప్రకటించింది. ఎల్ఐసి పాలసీదారులు ఆన్లైన్ లో తమ పాలసీని నమోదు చేసుకోవడానికి
www.licindia.in లో కస్టమర్ పోర్టల్‌ కి వెళ్లి పాలసీని నమోదు చేసుకోవచ్చు.

ఇక పాలసీదారులు ఆన్లైన్లో వాట్స్అప్ సేవలని ఎలా పొందచ్చనేది తెలుసుకుందాం

• పాలసీదారులు వాట్సాప్ సేవలు పొందటానికి మొదట మీ మొబైల్ లో ఈ వాట్సాప్‌ నంబర్‌ 8976862090ను సేవ్‌ చెయ్యండి.
• ఆ తరవాత మీరు వాట్సాప్‌ని ఓపెన్‌ చేసి ఆ తరవాత ఎల్‌ఐసి వాట్సాప్ చాట్ బాక్స్‌లో సెర్చ్ చేసి ఓపెన్‌ చేసేయండి.
*ఆ తరువాత ఆ నంబర్ కి చాట్ బాక్స్‌లో ‘హాయ్’ అని పంపండి.
• ఇప్పుడు మీకు 11 ఆప్షన్స్‌ వస్తాయి. వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి చాట్‌లో ప్రత్యుత్తరం ఇవ్వండి .
• అప్పుడు మీరు సేవలని పొందొచ్చు.ఇలా మీరు ఎల్‌ఐసీ వాట్సాప్ చాట్‌ లో అవసరమైన సేవలని పొందొచ్చు.