కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. ఆ పథకాలు రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాన్ని చేకూర్చుతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొత్త పథకాల వల్ల రైతులకు మేలు జరుగుతోంది. మోదీ సర్కార్ రైతులకు మేలు చేయడం కోసం పీఎం కిసాన్ స్కీమ్, ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ఫసల్ బీమా యోజన స్కీమ్స్ ద్వారా రైతులకు ఏ మాత్రం నష్టం కలగకుండా చేస్తోంది.
ఏపీలో రైతు భరోసా స్కీమ్ అమలవుతుండగా తెలంగాణలో రైతు బంధు స్కీమ్ అమలవుతోంది. అయితే రైతులు కెమికల్స్ తో పండించిన కూరగాయలు తినడం వల్ల కొంతమేర నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించే దిశగా బీహార్ ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను అమలులోకి తీసుకురావడం గమనార్హం.
గరిష్టంగా రెండెకరాల వరకు 23,000 రూపాయలు ఇచ్చేలా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటంతో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో బెనిఫిట్ కలగనుంది. 25 మంది రైతులు ఒక క్లస్టర్ గా ఏర్పడి వ్యవసాయం చేస్తే మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో సర్టిఫైడ్ కంపోస్ట్, ప్లాస్టిక్ డ్రమ్ లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు పీఎం కిసాన్ నగదు త్వరలోనే మోదీ సర్కార్ రైతుల ఖాతాల్లో జమ చేయనుందని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మంచి జరగాలని ఈ స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయని తెలుస్తోంది.