బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ.45 వేలకే తులం బంగారం?

gold prises rises and silver also

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం వస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. అయితే బంగారం ప్రియులకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే శుభవార్త వెలువడింది. రూ.45 వేలకే తులం బంగారం అంటూ అదిరిపోయే ప్రకటన వచ్చింది.

అయితే భూటాన్ లో మాత్రమే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. భూటాన్ ప్రభుత్వం బంగారం ప్రియులకు ప్రయోజనం చేకూర్చాలని ఈ ప్రకటన చేసింది. ఎలాంటి ట్యాక్స్ లు చెల్లించకుండానే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మొత్తంలో డబ్బులను కలిగి ఉన్నవాళ్లు ఈ బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు.

అయితే ఈ బంగారాన్ని కొనుగోలు చేయాలంటే మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూటాన్ నూతన సంవత్సరం సందర్భంగా పన్ను లేని బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభించింది. భూటాన్ కు వెళ్లే పర్యాటకులకు ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. భూటాన్‌లో బంగారం ధర 43000 రూపాయలు కాగా ఈ బంగారం కొనుగోలు చేసేవాళ్లు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజ్ ను చెల్లించాల్సి ఉంటుంది.

భూటాన్ ప్రభుత్వం టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో ఒక రాత్రి బస చేసిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్ల ద్వారా డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. భారతీయ స్త్రీ రూ. 1 లక్ష విలువైన బంగారాన్ని, పురుషుడు 50,000 రూపాయల విలువైన బంగారాన్ని పన్ను లేకుండా మన దేశానికి తీసుకొని రావచ్చు.