బంగారం ధరలు బగబగ మండిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. 10 గ్రాముల ధర ఒకేసారి రూ.1370 పెరిగింది. తెలుగు రాష్రాల్లో తాజా ధరలు ఓసారి చూస్తే.. ప్రస్తుతం పసిడి రేటు రూ. 51,550 వద్ద కొనసాగుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1250 పెరిగి రూ. 47,250గా ఉంది. వెండి రేటు కూడా పెరిగింది. రూ.2,700 పెరుగుదలతో రూ. 72,700 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుత ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 వద్ద కొనసాగతుంది.