ఫోర్బ్స్ ఇండియా సంపన్నులు జాబితా, 2020:వరుసగా 13 వ సారి ముఖేష్ అంబానీ నెం.1

Forbes India Rich List 2020 Mukesh Ambani wealthiest

ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ ఇండియా జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 13 వ సంవత్సరం సంపన్న భారతీయుడిగా నిలిచారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉన్న ఈ సంవత్సరంలో, భారతదేశంలో చాలా మంది ధనవంతులు వారి సంపదను బాగానే పెంచుకున్నారు. ముఖేష్ అంబానీ వరుసగా 13 వ సంవత్సరం సంపన్న భారతీయుడిగా నిలిచాడు, అతని నికర ఆస్తికి 37.3 బిలియన్ డాలర్లు జోడించాడు ”అని ఫోర్బ్స్ పేర్కొంది. టాప్ 10 లో, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా చోటు దక్కించుకుంది.

Forbes India Rich List 2020 Mukesh Ambani wealthiest
Forbes India Rich List 2020 Mukesh Ambani wealthiest

ఈ జాబితాలో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర సంపద 88.7 బిలియన్ డాలర్లుతో మొదటి స్థానంలో ఉన్నారు.అతని సంస్థ తన మొబైల్ సేవల వ్యాపారం జియో ప్లాట్‌ఫామ్‌లలో 20 బిలియన్ల పెట్టుబడులతో మంచి ఆదాయాన్ని కలిగి ఉంది. ఫేస్బుక్ , గూగుల్, కెకెఆర్, సిల్వర్ లేక్,మరియు ముబడాలా లాంటి పెద్ద కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టుబడిదారులుగా ఉన్నారు. తోటి వ్యాపారవేత్త సునీల్ మిట్టల్ మూడు స్థానాలు పెరిగి 10.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో 11 వ స్థానంలో నిలిచాడు. ”అని ఫోర్బ్స్ పేర్కొంది.

ఫోర్బ్స్ వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్ ల్యాబ్స్ ఎండీ మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీపీ రెడ్డి, అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

భారతదేశపు టాప్-20 ధనవంతుల జాబితా :-

1. ముఖేష్ అంబానీ (88.7 బిలియన్ డాలర్లు)

2. గౌతమ్ అదానీ (25.2 బిలియన్ డాలర్లు)

3. శివ నాదర్ (20.4 బిలియన్ డాలర్లు)

4. రాఫకిషన్ దమాని (15.4 బిలియన్ డాలర్లు)

5. హిందూజా సోదరులు (12.8 బిలియన్ డాలర్లు)

6. సైరస్ పూనవల్లా (11.5 బిలియన్ డాలర్లు)

7. పల్లోంజి మిస్త్రీ (11.4 బిలియన్ డాలర్లు)

8. ఉదయ్ కోటక్ (11.3 బిలియన్ డాలర్లు)

9. గోద్రేజ్ కుటుంబం (11 బిలియన్ డాలర్లు)

10. లక్ష్మి మిట్టల్ (10.3 బిలియన్ డాలర్లు)

11. సునీల్ మిట్టల్ (10.2 బిలియన్ డాలర్లు)

12. దిలీప్ షాంఘ్వీ (9.5 బిలియన్ డాలర్లు)

13. బర్మన్ కుటుంబం (9.2 బిలియన్ డాలర్లు)

14. కుమార్ బిర్లా (8.5 బిలియన్ డాలర్లు)

15. అజీమ్ ప్రేమ్‌జీ (7.9 బిలియన్ డాలర్లు)

16. బజాజ్ కుటుంబం (7.4 బిలియన్ డాలర్లు)

17. మధుకర్ పరేఖ్ (7.2 బిలియన్ డాలర్లు)

18. కుల్దీప్ మరియు గుర్బాచన్ సింగ్ ధింగ్రా (6.8 బిలియన్ డాలర్లు)

19. సావిత్రి జిందాల్ (6.6 బిలియన్ డాలర్లు)

20. మురళి దివి (6.5 బిలియన్ డాలర్లు)