ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలు చేసే వారితో పోల్చుకుంటే ఎక్కువగా బిజినెస్ లు చేసేవారి సంఖ్యలు ఎక్కువగా ఉంది. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా సైడ్ ఇన్ కమ్ సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి బిజినెస్ లు చేయాలి అన్న విషయంపై చాలామందికి సరైన అవగాహన ఉండదు. మీరు కూడా సైడ్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ బిజినెస్ లో ప్రయత్నించాల్సిందే. సాధారణంగా ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ లో డబ్బులు ఇస్తే అక్కడున్న వ్యక్తి మనకు వాటర్ అందిస్తున్నారు.
కానీ ఆధునిక టెక్నాలజీ కాలంలో కాయిన్స్ ద్వారా అదేవిధంగా కార్డు స్కానింగ్ ద్వారా వాటర్ తీసుకోవచ్చు. ఇలా ఈ బిజినెస్ ద్వారా ఒక వ్యక్తి బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు అన్న వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా కాయిన్స్ వేయడం ద్వారా వాటర్ వస్తుంది. అదేవిధంగా 290 వన్ మంత్ కార్డు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వచ్చినప్పుడల్లా కార్డు స్కాన్ చేయడంతో వాటర్ వస్తున్నాయి. 2016 నుండి శ్యామల శంకర్ రెడ్డి ఇక్కడ నూతన టెక్నాలజీ తో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు అప్పట్లో లక్షన్నర వరకు ఖర్చు వచ్చింది.
అందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవట.. అదేవిధంగా ఈ వాటర్ తాగిన వారికి ఆరోగ్య సమస్యలు కూడా రావడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ రోజుల్లో ఇలా కాయిన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ కాయిన్స్ మెషిన్ ని స్థానికంగా ఉన్నటువంటి సూర్యపేట జిల్లా నుండి కొనుగోలు చేశామని సదరు వ్యక్తి తెలిపారు. ఇది చాలా అద్భుతంగా నడుస్తుందని, రిపేర్లు కూడా రావడం లేదన్నారు. 5 రూపాయల కాయిన్ వేయడం ద్వారా 10 లీటర్లు నీళ్ల క్యాను నింపుతుంది. వన్ రూపీ వేస్తే ఒక లీటర్ నీళ్లు నింపుతుందట. దీని ద్వారా ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనిషి లేకుండా కూడా ఆదాయం వస్తుందన్నారు. అయితే మనిషి లేకుండానే ఆయన రోజుకు 1000 వరకు సంపాదిస్తుంటే మనిషి ఉండి ఇంకా డెవలప్ చేసుకుంటే ఈ బిజినెస్ లో మంచి ఇన్కమ్ ను మనం పొందవచ్చు.