పీఎం భారతీయ జన ఔషధి పరియోజన పథకం గురించి మనలో చాలామందికి తెలియదు. ఈ స్కీమ్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. తక్కువ ధరకే మందులు ఇస్తూ అమ్మిన మెడిసిన్స్ పై కమిషన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. కొత్త జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
వైద్యులు సైతం బ్రాండెడ్ మందులకు బదులుగా జనరిక్ మందులనే రోగులకు రాయాలని నిబంధనలు ఉన్నాయి. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. 1500 దరఖాస్తులు వస్తాయని ఆశించగా 2,500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్రం ఈ స్కీమ్ లో భాగంగా 9400కు పైగా స్టోర్లను నిర్వహిస్తుండటం గమనార్హం. దేశంలోని 651 జిల్లాలలో ఈ స్కీమ్ అమలవుతోందని సమాచారం అందుతోంది. గ్రామీణ ప్రాంతాలలో నివశించే వాళ్లకు సరసమైన ధరలకు మందులు అందించాలని కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. 2023 సంవత్సరంలోపు 2000 కొత్త ఔషధి కేంద్రాల దిశగా అడుగులు పడనున్నాయి.
జన్ ఔషధి పోర్టల్ ద్వారా కేంద్రాలను ఓపెన్ చేయడం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రాలను ఓపెన్ చేసిన వాళ్లు 20 శాతం కమిషన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.