పదే పదే కళ్లు తిరుగుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో కళ్లు తిరగడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బీపీపీవీ, ఇన్‌ఫెక్షన్, మెనియెర్స్ డిసీజ్, మైగ్రైన్ ఇతర కారణాల వల్ల కళ్లు తిరిగే అవకాశం అయితే ఉంటుంది. బినైన్ ప్యారోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో సమస్యతో బాధ పడే వాళ్లకు కళ్లు తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. వెస్టిబ్యులర్ న్యూరైటిస్ అనబడే వెస్టిబ్యులర్ నెర్వ్‌లో ఉండే వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా వర్టిగో వచ్చే అవకాశాలు ఉంటాయి.

చెవి లోపలి భాగంలో ఫ్లూయిడ్ బిల్డప్ అయితే చాలా గంటల పాటూ ఉండే వెర్టిగో సడన్ గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. మైగ్రైన్ వల్ల వచ్చే వెర్టిగో కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకూ ఉంటుందని చెప్పవచ్చు. వెర్టిగో ఉంటే ఒత్తిడి ఆ సమస్యని తీవ్రం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. తాము తిరిగిపోతున్నట్లో, చుట్టూ ఉన్న వారూ, చుట్టూ ఉన్న వస్తువులూ తిరిగిపోతున్నట్లో అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

చెమట ఎక్కువగా ఉండడం, వికారం, వాంతులు ఇందుకు సంబంధించిన లక్షణాలు అని చెప్పవచ్చు. కొన్ని మెడిసిన్స్, వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ థెరపీ ద్వారా లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలని నెగ్లెక్ట్ చేస్తే దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, నీరసం ఇలా వివిధ కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటే అప్పుడు తప్పకుండా కార్డియాక్ ఎక్స్‌పర్ట్ సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. హఠాత్తుగా బ్లడ్ ప్రెషర్లో మార్పు కనపడడం వలన బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ లేదా కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఉంటే మంచి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.