రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ రేట్లతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో కల్తీ పెట్రోల్ తో మరింత పరేషాన్ అవుతున్నారు. అయితే ఇకపై పెట్రోల్ నీళ్లు కలిపితే బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 80 శాతం నీరు… 20 శాతం ఇంధనంతో నడిచే కార్లు వచ్చేశాయి. రూపొందించారు ఓ తెలుగు సైంటిస్ట్ .పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా…. నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు గాలితో వాహనాలను నడపొచ్చు. గాలి కొట్టిచ్చుకుని ఎక్కడికయినా రయ్ రయ్ మంటూ తిరిగెయ్యొచ్చు.
వీటి వల్ల రోడ్ల పైన కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. దాని వల్ల వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. నీరు అంటే ఆక్సిజన్, హెడ్రోజన్ మిశ్రమం. నీటి నుంచి హెడ్రోజన్ ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్న ఆలోచనలో ప్రయోగాలు మొదలు పెట్టారు కొందరు శాస్త్రవేత్తలు. వాటర్ హెడ్రోలసిస్ థెరఫీ ద్వారా హెడ్రోజన్ తయారవుతుంది. అలా తయారు అయిన హెడ్రోజ్.. ఇంజన్ లోకి వెళ్లీ కంప్రెస్ అవుతుంది. ఇంజన్ నడవడానికి ఈ హెడ్రోజన్ ఉపయోగపడు తుంది. వాటర్ ఫ్యూయల్ తో వాహనాల మైలీజీ కూడా పెరుగుతుందంటున్నారు. ఒక లీటర్ వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ డైరెక్టుగా కంబషన్ చాంబర్ లోకి వెళ్లి.. ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ వాటర్ ఫ్యూయల్.. 30 లీటర్ల ఫ్యూయల్ కు సమానమంటున్నారు సుందర్.
ఇక హైడ్రోజన్ అంటే గాలి. గాలితో కూడా వాహనాలను నడపవచ్చు. మరి ఇన్ని రోజులు ఎందుకు వాటిని ఉపయోగించలేదు అంటే. ఈ విషయాన్ని రెండేళ్ళ క్రితమే కనుక్కున్నారు. రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే అది నీరవుతుంది. అది మనకు తెలిసిన విషయమే అయితే దాన్ని విడదీస్తే హైడ్రోజన్ లభిస్తుంది. గాలి రూపంలో ఉండే హైడ్రోజన్‌ను పట్టుకోవడమూదాన్ని వాహనాల్లో బంధించడం అనేది అంత తేలికయిన విషయం కాదు. అది ఎలా చేయాలన్న విషయం పై మూడు నాలుగు దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే దేశవ్యాప్తంగా సరఫరా కేంద్రాలు పెట్టడం కాస్త ఇబ్బంది పనని అమెరికా ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదదనను పక్కన పెట్టింది.