సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల అయ్యింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం, సినిమా బాగుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించటం కలిసొచ్చింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ కు వచ్చేసరికి ప్రపంచ వ్యాప్యంగా 8.81 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఏరియాల వారిగా బ్రేకప్ వివరాలు చూద్దాం.
ఏరియా షేర్ (కోట్లలో )
——————– —————————————-
నైజాం 1.55
సీడెడ్ 1.61
నెల్లూరు 0.41
కృష్ణా 0.61
గుంటూరు 1.12
వైజాగ్ 0.57
ఈస్ట్ గోదావరి 0.32
వెస్ట్ గోదావరి 0.42
మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 6.61
కేరళ 0.70
అమెరికా 0.95
మిగతా ప్రాంతాలు 0.55
మొత్తం ప్రపంచ వ్యాప్త షేర్ 8.81
మరో ప్రక్క సినిమాకు టాక్ బాగుండటం వల్ల డిజిటల్ ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలికాయి. డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్లు భారీ రేటుకే కొన్నారని టాక్. మరో ప్రక్క శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇదే స్దాయి లో అమ్ముడవుతానటంలో సందేహం లేదు. సో ఎలా లేదన్నా యాత్ర నిర్మాతలకు బిజినెస్ తో సంబంధం లేకుండా ఈ రైట్స్ రూపంలోనే మొత్తం బడ్జెట్ రికవరీ అవుతుంది. మిగతాదంతా మిగులే.