‘సర్కార్‌’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియావైజ్)..షాకింగ్

‘ఇలయ దళపతి’ విజయ్‌, ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘సర్కార్‌’ సినిమా దీపావళి సందర్బంగా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి యావరేజ్ టాక్ తెలుగులో వచ్చింది. అబ్బే ..సెకండాఫ్ బాగోలేదు అంటూ చాలా మంది పెదవి విరిచేసారు. రివ్యూలు సైతం ..సోసో గా ఉందన్నారు.

అయితేనేం ఆ తర్వాత సర్కార్ సినిమాని బీట్ చేసే సినిమా ఒక్కటీ దీపావళికి రాకపోవటం కలిసి వచ్చింది. దాంతో ఉన్నంతలో ఈ సినిమానే బెటర్ అని జనం ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఈ నేఫధ్యంలో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కలెక్షన్స్ పరిశీలిస్తే మంచి హిట్ అనిపిస్తోంది. అందుకు కారణం విజయ్ కి తెలుగులో ఉండే మార్కెట్, గత చిత్రాల కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇవి చాలా మంచి కలెక్షన్స్.

సర్కార్ సాధించిన ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.53 cr

సీడెడ్ – 1.80 cr(తెలుగు + తమిళం కలిపి)

ఉత్తరాంధ్ర – 0.83cr

ఈస్ట్ – 0.45 cr

వెస్ట్ – 0.55 cr

కృష్ణ – 0.67 cr

గుంటూరు – 0.79 cr

నెల్లూరు – 0.32 cr

టోటల్ (ఏపీ + తెలంగాణా) – రూ. 7.95 cr

ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి… సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించింది. దీపావళి కానుకగా నవంబరు 6 అంటే ఈ రోజున ‘సర్కారు’ను విడుదల చేసారు.