‘ఇలయ దళపతి’ విజయ్, ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సర్కార్’ సినిమా ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యుఎస్ లో షోలు పడ్డాయి. అక్కడనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ చిత్రం ఫస్టాఫ్ రిపోర్ట్ ఇప్పటికే ఇచ్చాం. ఇప్పుడు సెకండాఫ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.
సర్కార్ చిత్రం సెకండాఫ్ …పెంచిన అంచనాలు అందుకునేలా లేదు. జస్ట్ ఓకే అన్నట్లు సాగింది. ఇంటర్వెల్ దగ్గర వచ్చిన హైప్ కు తగ్గట్లుగా లేదు. వరలక్ష్మీ శరత్ కుమార్ (పందెం కోడి 2 విలన్) ఇక్కడ కూడా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది. విజయ్ తన పొలిటికల్ జర్నీ ప్రారంభింస్తాడు. రైవల్ పార్టీకి చెందిన పార్టీ ఆఫీస్ కు వెళ్లి..తన వాళ్లను 234 నియోజక వర్గాల్లో నిలబెడతానని సవాల్ విసురుతాడు. తన వాళ్లను గెలిపించటానికి విజయ్ స్ట్రాటజీలు ప్లే చేస్తాడు. ఇక్కడ నుంచి సినిమా దారి తప్పింది.
అయితే రైవల్ పార్టీ ..వాళ్ల కూతురు అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ సీన్ లోకి వస్తుంది. ఆమెతో పొలిటికల్ వార్ ప్రారంభమవుతుంది హీరోకు. అక్కడ నుంచి కొద్దిగా ఊపు అందుకుంటుంది. ఎలక్షన్స్ అవుతాయి. విజయ్ గెలుస్తాడు. ఛీఫ్ మినిస్టర్ అయ్యేసమయం. వేర్వేరు గుర్తు మీద 210 మంది విజయ్ కు చెందిన వారు గెలుస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ని సెలక్ట్ చేయాలి. విజయ్ వారిలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి …తాను కేవలం 14 రోజుల్లో ఎలా పొలిటికల్ స్ట్రాటజీని మార్చాడో చెప్తాడు.
ఫస్టాఫ్ ఉన్నట్లుగా సెకండాఫ్ కూడా ఉంటే సినిమా బాగుండేది. అయితే ఆ స్దాయి లేదు. ముఖ్యంగా తమిళ రాజకీయాలకు సంభందించిన సీన్స్ మనకు బోర్ కొడతాయి. విషయం లేకుండా సెకండాఫ్ నడిచిన ఫీల్ వస్తుంది అని చూసిన వాళ్లు చెప్తున్నారు.
ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 6 అంటే ఈ రోజున ‘సర్కారు’ను విడుదల చేస్తున్నారు.