Gallery

Home Box Office 'సర్కార్‌' ఫస్టాఫ్ రిపోర్ట్: కథేంటి,ఎలా ఉంది?

‘సర్కార్‌’ ఫస్టాఫ్ రిపోర్ట్: కథేంటి,ఎలా ఉంది?

‘ఇలయ దళపతి’ విజయ్‌, ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘సర్కార్‌’ సినిమా ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యుఎస్ లో షోలు పడ్డాయి. అక్కడనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ చిత్రం ఫస్టాఫ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

సర్కార్ ఫస్టాఫ్ ..అద్బుతం కాదు కాదు అలాగని బోర్ కొట్టనూ లేదు. డీసెంట్ గా చకచకా సీన్స్ నడిచిపోయాయి. తన ఓటుని వేరే వారు వేసేయటం ..హీరో లీగల్ గా పోరాడటం అనే పాయింట్ చుట్టూ కథ తిరిగింది ఇప్పటివరకూ. అది కాస్త సూపర్ ఫిషియల్ గా అనిపించినా..దర్శకుడు మురగదాస్ తనదైన మాస్ ఎలిమెంట్స్ తో కథనం పరుగెత్తించాడు.

అలాగే ఇప్పటివరకూ జరిగిన కథ ఏమిటంటే..

ప్రఖ్యాత జి.ఎల్ గ్రూప్ సీఈఓ అయిన సుందర్ (విజయ్)..బిజినెస్ లోనే కాదు లాస్ ఏంజెల్స్ కానీలోనూ దుమ్ము రేపుతూంటాడు. అతను తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి చెన్నై వస్తాడు. అక్కడే కీర్తి సురేష్ పరిచయం అవుతుంది పోలింగ్ ఏజెంట్ గా. అయితే ఊహించని విధంగా సుందర్ ఓటుని వేరే వాళ్లు ఆల్రెడీ వేసేసి ఉంటారు. దాంతో సుందర్ కు మండుకొస్తుంది. నా ఓటుని వేరే వాళ్లు వేసేయటం ఏమిటని నిలదీస్తాడు.

Sarkar 1 | Telugu Rajyam

పెద్ద గొడవ అవుతుంది. కానీ విషయం తేలదు. దాంతో కోర్టుకు వెళ్తాడు. సెక్షన్ 49-పి ని తిరగతోడ్తాడు. దాంతో తిరిగి అక్కడ జనరల్ ఎలక్షన్స్ మళ్లీ నిర్వహిస్తారు. 15 రోజుల్లో రీ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటిస్తారు. అప్పుడు సుందర్ ఓ నిర్ణయం ప్రకటిస్తాడు..అదేమిటంటే…సుందర్ తన నియోజకవర్గంలోనే ఎలక్షన్స్ లో నిలబడతాడు.. అక్కడ ఇంటర్వెల్ పడుతుంది.

ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 6 అంటే ఈ రోజున ‘సర్కారు’ను విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Posts

Box Office: ప్రదీప్ ఫస్ట్ మూవీ.. మొత్తానికి బతికిపోయింది

లాక్ డౌన్ తరువాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు అందిస్తాయా లేదా అనే విషయం కంటే కూడా అసలు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తాయా అనే విషయంపైనే అనుమానాలు ఎక్కువగా వచ్చాయి. ఇక...

30రోజుల్లో ప్రేమించడం ఎలా?.. కలెక్షన్స్ తో షాక్ ఇచ్చిన ప్రదీప్

బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. ఆడియెన్స్ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక యాంకర్...

యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

Latest News