‘సర్కార్‌’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

తమిళంలో ఓ రేంజిలో క్రేజ్‌ ఉన్న స్టార్ హీరో ‘ఇలయ దళపతి’ విజయ్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాత్మక అంశాలను కలుపుతూ చిత్రాలను తీసే దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సర్కార్‌’ సినిమా తెరకెక్కి ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో ..ఏరియా వైజ్ చూద్దాం.


ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం 2 కోట్లు అడ్వాన్స్
సీడెడ్ 2 కోట్లు NRA (చిత్తూరు జిల్లా తమిళ వెర్షన్ కూడా కలిపి)
ఉత్తరాంధ్ర 0.90 కోట్లు
గుంటూరు 0.72 కోట్లు
ఈస్ట్ గోదావరి 0.68కోట్లు
వెస్ట్ గోదావరి 0.50 కోట్లు
కృష్ణా 0.60కోట్లు
నెల్లూరు 0.30 కోట్లు
మొత్తం 7.70కోట్లు

ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 6 అంటే ఈ రోజున ‘సర్కారు’ను విడుదల చేస్తున్నారు.