టాక్సీ వాలా: ప్రీమియర్ షో టాక్,స్టోరీ

రెండు మూడు సినిమాలతోనే యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అంటే భాక్సాఫీస్ దగ్గర వచ్చే ఆ సందడే వేరు. దాంతో ఈ రోజు ఆయన అభిమానులంతా కూడా ‘టాక్సీవాలా’ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . విజయ్ తన కెరియర్ మొదటి నుండి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ వస్తూండటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి .

అయితే రిలీజ్ కు ముందు పైరసీ ప్రింట్ వచ్చేయటం సినిమాకు ఊహించని దెబ్బే. అయితే ఆయనకు అభిమానులు అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఈ నేఫధ్యంలో ఈ రోజు (17వ తేదీన) టాక్సీవాలా సినిమా విడుదల అవుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం..


కథేంటంటే…

జాబ్ ట్రైల్స్ లో ఉన్న విజయ్..ముందు ఏదో రకంగా రూపాయి సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. అన్నావదినల సాయింతో పాతకాలం కారును కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. ఒక అమ్మాయి ప్రేమలో పడ్డ శివ ఆ తరువాత క్యాబ్ వల్ల ఊహించని సమస్యలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత మెల్లిగా ఆ క్యాబ్ లో ఎదో తెలియని దెయ్యం ఉందని అర్దం చేసుకుంటాడు.

ఆ విషయం ఫ్రెండ్స్ కు చెప్పినా ఎవరూ నమ్మరు. పోనీ క్యాబ్ ని వదిలేద్దామంటే అది..విజయ్ ని వదలదు. సర్లే అనుకుంటే ఈ లోగా ఓ రోజు ..ఆ క్యాబ్ ఓ వ్యక్తిని చంపేస్తుంది. దాంతో విజయ్ కు భయం పట్టుకుంటుంది. అక్కడ నుంచి కారుతో ఇంటరాక్ట్ అవటం మొదలెడతాడు. అక్కడ నుంచి ఏమి జరిగింది..అసలు క్యాబ్ ని పట్టిన దెయ్యం ప్లాష్ బ్యాక్ ఏమిటనేది మిగతా కథ.

ప్రీమియర్ షో టాక్ ఏమిటి

సినిమా ఫస్ట్ హాఫ్ ఫన్ తో బాగుందనిపించినా, సెకండాఫ్ లో అంత సీన్ లేదని అంటున్నారు. విజయ్ దేవరకొండ కామెడీ సీన్స్ లో మాత్రం కేక పెట్టించాడని, అవే సినిమాని నిలబెట్టాలని చెప్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ కోసం టీమ్ పడ్డ కష్టం కనపడుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా చేసారు. అయితే ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో లేదంటున్నారు.

అయితే ఇది కేవలం టాక్ మాత్రమే. మరికొద్ది సేపట్లో పూర్తి స్దాయి రివ్యూతో కలుస్తాం.