‘టాక్సీవాలా’ : క్లోజింగ్ కలెక్షన్స్..ఎంతో తెలిస్తే షాక్

రెండు మూడు సినిమాలతోనే యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అంటే భాక్సాఫీస్ దగ్గర వచ్చే ఆ సందడే వేరు. దాంతో ఆయన అభిమానులంతా కూడా ‘టాక్సీవాలా’ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసారు .

పైరసీ ప్రింట్ బయిటకు వచ్చేసినా ఏ మాత్రం ఓపినింగ్స్ తగ్గలేదు. రిలీజ్ కు ముందు పైరసీ ప్రింట్ వచ్చేయటం సినిమాకు ఊహించని దెబ్బే. అయితే ఆయనకు అభిమానులు అండగా ఉంటామని మాట ఇచ్చారు.

విజయ్ తన కెరియర్ మొదటి నుండి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ వస్తూండటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండటం కలిసొచ్చింది. రూ. 21 కోట్ల షేర్ కలెక్షన్స్ తో ఈ సినిమా విజయ్ దేవరకొండ కేరీర్ లో మూడో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది.

ఫుల్ రన్ లో ‘టాక్సీవాలా’ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – 7.71 cr

సీడెడ్ – 1.64 cr

ఉత్తరాంధ్ర – 1.84 cr

ఈస్ట్ – 0.96 cr

వెస్ట్ – 0.79 cr

కృష్ణ – 1.14 cr

గుంటూరు – 1.15 cr

నెల్లూరు – 0.46 cr

ఏపీ+తెలంగాణా టోటల్ : రూ. 15.69 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.59 cr

ఓవర్సీస్: 3.02 cr

వరల్డ్ వైడ్ టోటల్ : రూ.21.30 కోట్లు