డిసెంబర్ 21: సోషల్ మీడియాలో యుద్దానికి సర్వం సిద్దం

ఇరు వైపు సేనలు తమ ఆయుధాలను సరిచూసుకుంటున్నారు. సైన్యాధిపతులు సై అనగానే రంగంలోకి దూకి తమ సత్తా చూపించబోతున్నారు. సోషల్ మీడియాలో అతి త్వరలో పెద్ద యుద్దం మొదలవుతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ట్రైలర్ డిసెంబర్ 21న రిలీజ్ అవుతూంటే..అదే రోజున జగన్ పుట్టిన రోజు సందర్బంగా యాత్ర టీజర్ సైతం రాబోతోంది. ఈ రెండు ట్రైలర్స్,ప్రమోషన్ మెటీరియల్ సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ చేస్తాయని అంచనా వేస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం…ఇప్పటికే నందమూరి ఫాలోవర్స్,తెలుగు దేశం పార్టీ అభిమానులు అంతా …ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తూంటే, వైయస్సార్ అభిమానులు, పార్టీవాళ్లు యాత్ర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ట్రైలర్ రిలీజైన తర్వాత ఏ ట్రైలర్ కు ఎక్కువ వ్యూస్ వస్తాయనే విషయం ఖచ్చితంగా చర్చకు వస్తుంది కాబట్టి..ఎవరికి వాళ్లే ఎదుటివాళ్ల రికార్డ్ ని బ్రద్దులు కొట్టేలా లైక్ లు,వ్యూస్ తేవాలని ఫిక్స్ అయ్యారట. అలాగే ఖచ్చితంగా ఒకటి ట్రైలర్ మీద మరొకరు ట్రోల్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 21 న సోషల్ మీడియాలో ఓ రేంజిలో హంగామా చూడబోతున్నాం అన్నమాట.

ఎన్టీఆర్ బయోపిక్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అయితే అక్కడే ఓ సమస్య కూడా ఉంది. ఇప్పటిదాకా  బయటకు వచ్చిన విజువల్స్, ఫొటోలు కన్నా కొత్తవి ట్రైలర్ లో చూపించగలగాలి. లేకపోతే కొత్తగా ఏమీ లేదు  అనిపిస్తుంది. అలాగే అదే సమయంలో  కేవలం ఎన్టీఆర్ గొప్పతనాన్నే చెప్తే భజన అని కూడా అనేస్తారు.. 

ఇక  వైయస్ యాత్ర సినిమా విషయానికి వస్తే… అసలు ఇప్పటిదాకా క్రేజే క్రియేట్ కాలేదు.దాంతో   విడుదల అయ్యే ట్రైలర్ లో ఖచ్చితంగా జనం  మాట్లాడుకునే ఎలిమెంట్స్ ఉండాలి. అలాకాకుండా వైయస్ గొప్పతనమే చెప్పుకుంటూ పోతే  లేకపోతే అది మరో  సాక్షి పేపరు అనే స్తారు. ఈ రెండూ బాలెన్స్ చేయాల్సిన అవసరం ఈ రెండు బయోపిక్ ల ట్రైలర్స్  కు, సినిమాలకు ఉంది.  లేకపోతే విమర్శలు తప్పవు.

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతుతోంది. మలయళం సూపర్‌స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తుండగా , 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు. గత కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ అంత పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులి చిత్ర యూనిట్ బిజీ అయ్యారట.

ఈచిత్రం డిసెంబర్ 21న వైఎస్సార్ తనుయుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు కానుకగా విడుదల కానుంది. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు.