పెద్ద సినిమా ఆడితే ఎంతలా కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తుందో..అదే స్దాయిలో సినిమా ఫ్లాఫ్ అయినా అదే స్దాయిలో దారుణాలు చూడాల్సివస్తుంది. రకరకాల సమస్యలు నిర్మాతలను వేధిస్తాయి. ఇప్పుడు అదే పరిస్దితి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ నిర్మాతలకు ఎదురౌతోంది. 5000 థియోటర్స్ల్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు కేవలం 1800 థియోటర్స్ కు వచ్చేసింది.
అదే స్దాయిలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఈ దశాబ్దపు పెద్ద డిజాస్ట్రర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా…డిస్ట్రిబ్యూటర్స్ కే కాక ఎగ్జిబిటర్స్ కు యాభై నుంచి అరవై శాతం నష్టాలను మిగులుస్తోంది. దాంతో వారంతా ఆ నష్టాలు రికవరీ చేయమని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారు.
మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న నటుడు అమీర్ ఖాన్ తన ప్రతి సినిమా ఒక ప్రయోగంలా కష్టపడి చేస్తూంటారు..విజయం సాధిస్తూంటారు. తాజాగా అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’భారీ డిజాస్టర్ అయ్యింది. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. వీరికి అందాల భామ కత్రినా కైఫ్ కూడా తోడవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
కళ్లు చెదిరే సెట్టింగులతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో, సరికొత్త పోరాట సన్నివేశాలతో సుమారు రూ.300 కోట్లు వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రత్యేకత సాధించింది. ఒకానోక దశలో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ‘బాహుబలి2’ని మించిపోతుందని టాక్ వచ్చింది.
కానీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత రివ్యూలన్నీ చాలా దారుణంగా వచ్చాయి. ఊహించని విధంగా డివైడ్ టాక్ రావడంతో రెండవరోజు నుంచి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. మొదటి రోజు 50కోట్లను అందుకోవడం తప్పితే తరువాత రోజు నుంచి తగ్గుతూ రావడం అందరిని షాక్ కి గురి చేశాయి. అమిర్ ఖాన్ గత ఐదేళ్ళలో ఎప్పుడు అందుకొని విధంగా.. సినిమా రిలీజైన మొదటి అయిదు రోజుల అనంతరం అతి తక్కువగా 7 కోట్ల ను మాత్రమే రాబట్టగలిగాడు. ఇవన్నీ ఇప్పుడు దర్శకుల తలకు సమస్యలుగా చుట్టుకుంటున్నాయి.