దీపావళి వెళ్లిపోయింది. పండక్కి వచ్చిన సినిమాలు వెళ్లిపోయాయి. దీపావళి సినిమాల్లో కేవలం సర్కార్ ఒక్కటే హిట్టైంది. విడుదలకు ముందే ఆసక్తిరేపిన మురగదాస్ బ్రాండిగ్ వల్ల కావచ్చు…లేదా వివాదాల వల్ల కావచ్చు..సినిమాలో కంటెంట్ వల్ల కావచ్చు..ఏదైతేనేం విజయ్ కు తెలుగులో మొదట హిట్ వచ్చింది. విజయ్ రెగ్యులర్ మార్కెట్ కంటే ఎక్కువ రేటుకు అమ్మినా వారం రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అయితే బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ గా గ్రాసర్స్ లిస్ట్ లోకి చేరింది.
ఇక భారీ అంచనాలతో రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్దాన్ అయితే తీవ్రంగా నిరాశపరిచింది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్స్ కు తోడు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్, ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ వంటి ఎలిమెంట్స్ కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. అమీర్ ఖాన్ కు తన కెరీర్ లో అతి పెద్ద ప్లాఫ్ గా మిగిలిపోయింది.
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అదిగో పరిస్దితి అయితే ఇంకా దారుణం. పందిపిల్లను ప్రధాన పాత్రలో పెట్టి రవిబాబు రూపొందించిన ఈ ప్రయోగం..వికటించింది. విడుదలకు ముందే అసలు కొంచెం కూడా ఎట్రాక్షన్ లేదు..రిలీజ్ అయ్యాక అది కూడా లేదు. మినిమం వసూళ్లు కూడా నమోదు చేయలేకపోయింది.
నాగచైతన్య సవ్యసాచి విషయానికి వస్తే ..అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైత్రీ మూవిస్ వారికి ఊహించని పెద్ద దెబ్బే. మార్నింగ్ షో టాక్ వచ్చిన దగ్గర నుంచే కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది.
ఈ వారం రిలీజైన రెండు చిత్రాలు అమర్ అక్బర్ ఆంటోని విషయానికి వస్తే మైత్రీ మూవీస్ వారికి ఇది మరో దెబ్బ. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇంత చెత్త సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఉన్నంతలో టాక్సీవాలా చిత్రమే భాక్సాఫీస్ కు కొద్దిలో కొద్ది ఊరట. ఈ సినిమా రిలీజ్ కు ముందు పైరసీ చూసి బాగాలేదు అనే టాక్ తెచ్చుకున్నా…రిలీజ్ తర్వాత హిట్ అయ్యింది. సినిమాలో కామెడీ జనాలకు బాగా పట్టింది. ఓవరాల్ గా సర్కార్..టాక్సీవాలా ఈ రెండే నిలిచాయి. విజయ్, విజయ్ దేవరకొండలకే సక్సెస్ దక్కింది.