‘అర్జున్ రెడ్డి’టైటిల్ తో విజయ్ ప్లాఫ్ సినిమా రిలీజ్

అర్జున్ రెడ్డి ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయ్యింది కదా…మళ్లీ రిలీజ్ డేట్ ఇవ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా… అర్జున్ రెడ్డి టైటిల్ తో ఓ చిత్రం తమిళంలో రిలీజ్ కు రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ , పూజా జావేరి జంటగా నటించిన చిత్రం ‘ద్వారకా’. 2017 లో విడుదలైన ఈ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తాజాగా తమిళంలోకి డబ్ చేసి విడుదలచేస్తున్నారు. అయితే ఇక్కడ ప్లాఫ్ సినిమా అక్కడ ఏ మేరకు హిట్ అవుతుందనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.

అందుకే నేమో నిర్మాతలు విజయదేవరకొండను, అర్జున్ రెడ్డి టైటిల్ ని అడ్డం పెట్టి గేమ్ ఆడబోతున్నారు. విజయ్ కెరీర్ లో కల్ట్ సినిమా గా నిలిచింది అర్జున్ రెడ్డి. ఇప్పుడు అదే టైటిల్ తో ఈ ద్వారకా చిత్రాన్ని నిర్మాత బాలాజీ మార్చి 15న అక్కడ విడుదలచేస్తున్నారు.

ఇక గీత గోవిందం, నోటా తో విజయ్ కి అక్కడ క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అయన నటించిన సినిమాలను అక్కడ విడుదలచేస్తున్నారు. మరి ఈ అర్జున్ రెడ్డి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. శ్రీనివాస రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , మురళి శర్మ , సురేఖ వాణి ముఖ్య పాత్రల్లో నటించారు.