‘సీత’ పరిస్దితి అంత దారుణమా?

కెరీర్ ప్రారంభంలో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇట్టి.. మధ్యలో ఒక దశాబ్దంన్నర పాటు హిట్ అనే మాట వినకుండా, చూడకుండా ఉండిపోయిన దర్శకుడు తేజ. అయితే రెండేళ్ల కిందట ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టాడు. ఈ సినిమా హిట్టైనా రకరకాల కారణాలతో కొంత విరామం తీసుకున్న తేజ.. కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమా తీశాడు. ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కానీ మార్నింగ్ షోకే టాక్ తేడా కొట్టేసింది. ఓపినింగ్స్ బాగా దారుణంగా వచ్చాయి.రివ్యూలు అయితే సినిమా అసలు బాగోలేదు అని చెప్పేసాయి. తేజ క్రేజ్ కొంచెం కూడా వర్కవుట్ కాలేదు. చాలా చోట్ల ఈ సినిమా వాష్ అవుట్ అయ్యింది. కొన్ని చోట్ల సోమవారం నుంచి తీసేస్తే, మరికొన్ని చోట్ల బుధవారం నుంచి థియోటర్స్ తీసేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ తెలంగాణాలో సీత ను చాలా చోట్ల తీసేసి అలాడిన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని వేసారు. ఇక ఈ వారం రిలీజైన లీసా 3డి సైతం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. లగడపాటి శ్రీధర్ కుమారుడు నటించిన ఎవడూ తక్కువ వాడు సినిమా సైతం డిజాస్టర్ అయ్యింది. దాంతో మహర్షి సినిమా వైపే జనం మ్రొగ్గుతున్నారు.