Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్.. మొన్నటి వరకు అడపదడపా సినిమాలలో నటించిన ఈ హీరో ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవల చివరగా భైరవం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించడంతో ఇప్పుడు అదే ఊపుతూ మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు శ్రీనివాస్ మరొక మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. కౌశిక్ పెగళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

ట్రైలర్ బట్టి చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఒక దెయ్యాల భవంతికి తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి,ఆ ప్లేస్ చుట్టూ వాకింగ్ చేయిస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లందరూ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌లా అనిపిస్తోంది. ఇందులో పైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వారి కామెడీ కూడా చేయించినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో అనుపమని దెయ్యంలా చూపించడం, దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తిమంతుడిగా హీరోని చూపించడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. ట్రైలర్ ని చూస్తుంటే అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరు అదరగొట్టేశారు అనిపిస్తుంది.
