Bhairavam: ఓటీటీలోకి రాబోతున్న భైరవం సినిమా.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే!

Bhairavam: టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమెడల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో అతిథి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 30వ తేదీన భారీ అంచనాల నడుమ గ్రాండ్గా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించింది.

ఈ సినిమా థియేటర్లలో మంచి సక్సెస్ అవడంతో ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటీటీ ప్రేక్షకులకు తాజాగా మూవీ మేకర్స్ ఒక శుభవార్తను తెలిపారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూలై 18 నుంచి తెలుగు, హిందీ భాష‌ల్లో భైర‌వం మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు జీ5 తెలిపింది. థియేట‌ర్ల‌లో అల‌రించిన ఈ చిత్రం ఓటీటీలో మ‌రెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి మరి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఇంతకీ ఈ భైరవం సినిమా కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? చివరికి అనుకున్నది సాధించారా లేదా? ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.